: క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే .. అయినా, చర్యలు తీసుకోవాల్సిందేనంటున్న కలెక్టర్!
కలెక్టర్ ప్రీతి మీనాతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆమెకు క్షమాపణలు చెప్పారు. మహబూబాబాద్ లోని కలెక్టర్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన ఆయన తన రెండు చేతులు జోడించి ప్రీతిమీనాకు క్షమాపణలు చెప్పారు. అయితే, ఆయన చెప్పిన క్షమాపణలకు ప్రీతి మీనా ఏమాత్రం స్పందించలేదు. శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ, ‘కలెక్టర్ నా సోదరి లాంటిది..అనుకోకుండా ఆమెకు నా చేయి తాకింది. అయినా, క్షమాపణలు చెప్పాను’ అని అన్నారు.