: మరో సవాల్ ను స్వీకరిస్తున్నా: టీమిండియా కొత్త కోచ్ రవిశాస్త్రి


సవాళ్లను స్వీకరించడం తనకేమీ కొత్త కాదని, కోచ్ గా మరో కొత్త సవాల్ ను స్వీకరిస్తున్నానని టీమిండియా కొత్త కోచ్ రవిశాస్త్రి అన్నారు. హెడ్ కోచ్ గా నియమితులైన అనంతరం, లండన్ లో ఉన్న రవిశాస్త్రి తొలిసారిగా ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, కోహ్లి నేతృత్వంలోని టెస్టు జట్టు గత జట్ల కంటే ఎంతో మెరుగ్గా తయారవుతుందని, అన్ని పరిస్థితుల్లోనూ రాణించ గల యువ పేసర్లు జట్టులో ఉన్నారని చెప్పారు. కాగా, ఈ నెల 26 నుంచి శ్రీలంక టూర్ కు టీమిండియా వెళ్లనుంది. ఈ సిరీస్ లో మూడు టెస్టు మ్యాచ్ లు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఆడుతుంది.

  • Loading...

More Telugu News