: యాసిడ్ దాడి నుంచి తప్పించుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్ కుటుంబం!


యాసిడ్ దాడి నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కుటుంబం తృటిలో తప్పించుకుని బయటపడిన సంఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. నాట్ వెస్ట్ టీ20 బ్లాస్ట్ మ్యాచ్ ల నిమిత్తం తమీమ్ ఇంగ్లాండ్ వెళ్లాడు. భార్య ఆయేషా, ఏడాది కుమారుడిని కూడా తన వెంట తీసుకువెళ్లాడు. నిన్న రాత్రి స్థానిక రెస్టారెంట్ లో డిన్నర్ చేసేందుకు తమీమ్ కుటుంబం వెళ్లింది. అక్కడే కాపుగాచి ఉన్న కొందరు దుండగులు వారిని వెంబడించి, యాసిడ్ దాడికి విఫలయత్నం చేశారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న తమీమ్ వెంటనే, తన కుటుంబంతో బంగ్లాదేశ్ వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ సంఘటనపై అక్కడి పోలీసులకు తమీమ్ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఈ సంఘటనపై మీడియాతో కూడా ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News