: మహబూబాబాద్ ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించారంటూ కలెక్టర్ ప్రీతి మీనా ఫిర్యాదు.. సీఎం సీరియస్!


మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా ఐఏఎస్ ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ ను కలిసి రేపు ఆమె ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. కాగా, ఈ వ్యవహారంపై కేసీఆర్ సీరియస్ అయ్యారని, సదరు ఎమ్మెల్యేను మందలించారని తెలుస్తోంది. తక్షణం కలెక్టర్ ను కలిసి క్షమాపణలు చెప్పాలని శంకర్ నాయక్ ను కేసీఆర్ ఆదేశించారని, లేని పక్షంలో పార్టీ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్టు తెలిసింది.  

  • Loading...

More Telugu News