: ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీరాజ్


భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ ఉమన్ గా చరిత్రకెక్కింది. మహిళల ప్రపంచకప్ లో భాగంగా బ్రిస్టల్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా ఆమె ఈ మైలురాయిని అందుకుంది. 183 వన్డేల్లో మిథాలీ ఈ ఘనతను సాధించింది. ఇదే సమయంలో వన్డేల్లో 6 వేల పరుగులు చేసిన తొలి మహిళగా ఆమె అవతరించింది. పస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో 53 పరుగులతో మిథాలీ క్రీజ్ లో ఉంది. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ కు చెందిన చార్లొట్టే ఎడ్వర్డ్స్ పేరిట ఉంది. 191 మ్యాచ్ లలో చార్లొట్టే 5992 పరుగులు చేసింది. 

  • Loading...

More Telugu News