: ట్విట్టర్ ద్వారా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన జగన్
ముఖ్యమంత్రి కావాలన్నది తన కల అని... 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలనే బలమైన కోరిక తనకు ఉందని ప్లీనరీలో చెప్పిన జగన్... తన కలను సాకారం చేసుకునే దిశగా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. మీ కోసం తొమ్మిది వాగ్దానాలు చేశానని.. 'అన్న వస్తున్నాడు... నవరత్నాలు తెస్తున్నాడు' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతోపాటు ప్లీనరీలో తను మాట్లాడిన వీడియోను అప్ లోడ్ చేశారు.