: విశాఖలో లంచం అడిగిన అధికారులను పట్టిస్తే నజరానా ఇస్తా: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
విశాఖలో లంచం అడిగిన అధికారులను పట్టిస్తే రూ.10 వేలు నజరానా ఇస్తానని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రకటించారు.ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ అవినీతిమయం అయిపోయిందని మరోమారు విమర్శలు గుప్పించారు. అధికారులు, యంత్రాంగంలో అవినీతిపరులకు అడ్డుకట్ట వేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. భూస్కాంలపై వివరాలు కోరుతూ సిట్ పంపించిన లేఖ అందిందని, 20వ తేదీ లోగా సిట్ అధికారులను కలిసి వివరాలు అందిస్తానని విష్ణుకుమార్ రాజు చెప్పారు.