: కరణ్ జొహార్ హ్యాండ్ బ్యాగు ఖరీదు రూ. 1.5 లక్షలు!
`ధర్మా ప్రొడక్షన్స్` పేరు వినగానే భారీ లొకేషన్లు, పెద్ద పెద్ద భవంతుల నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలు గుర్తొస్తాయి. దీని యజమాని కరణ్ జోహార్, సినిమాల నిర్మాణ విలువలు అలా ఉంటాయి మరి! ఇక, నిజజీవితంలో కూడా ఆయన లగ్జరీ వస్తువులు వాడటంలో ఎప్పుడూ ముందుంటాడు. అప్పుడప్పుడు ఖరీదైన కోట్లు, కళ్లద్దాలతో ఎయిర్‌పోర్టుల్లో కనిపించే ఆయన ఈసారి రూ. 1.5 లక్షల విలువ గల హ్యాండ్ బ్యాగుతో కెమెరాకు చిక్కారు. న్యూయార్క్‌లో జరగనున్న ఐఫా అవార్డుల వేడుకకు వెళ్తున్న కరణ్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. కోపంతో ఉన్న పిల్లి బొమ్మ గల ఈ బ్యాగును అంతర్జాతీయ బ్రాండ్ `గుచ్చి` వారు తయారుచేశారు. ఆన్‌లైన్‌లో దీని ధర 2,300 డాలర్లు. ఈ డబ్బుతో వారం రోజులపాటు యూరప్‌లో లగ్జరీగా గడిపి రావొచ్చు, తెలుసా!