: పాక్ పైశాచిక ఆలోచన.. భారత్ పై దాడులకు ఉగ్రవాదులకు రసాయనిక ఆయుధాలు!


భారత్ పై అనునిత్యం కుట్రలకు తెగబడుతూ, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ ఆలోచనలు పైశాచికంగా మారుతున్నాయి. తన కనుసన్నల్లో ఉంటూ, జమ్ముకశ్మీర్ లో దాడులకు తెగబడే హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు ఇకపై రసాయనిక ఆయుధాలను అందజేయాలని ఆలోచిస్తోంది. ఉగ్రవాదుల ఫోన్స్ కాల్స్ ఆధారంగా భద్రతా సంస్థలు ఈ విషయాలను తెలుసుకున్నాయి. రానున్న రోజుల్లో భారత్ వ్యతిరేక పోరాటాన్ని పాక్ మరింత తీవ్రతరం చేయబోతోందని ఓ హిబ్జుల్ కమాండర్ ఫోన్ కాల్ లో వినిపించింది. గత కొన్ని నెలల కాలంలో ఏకంగా 90 మంది ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దీంతో, సైనికులను ఎదుర్కోవడానికి రసాయనిక ఆయుధాలే బెటర్ అని పాకిస్థాన్, ఉగ్రవాదులు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News