: రూ. వెయ్యి లోపు నో ఛార్జ్... ఐఎంపీస్ బదిలీపై ఎస్‌బీఐ ప్రకటన
జీఎస్టీ అమల్లో భాగంగా ఐఎంపీఎస్ ద్వారా రూ. 1000 లోపు ఆన్ లైన్ బదిలీలపై ఎలాంటి ఛార్జీ చెల్లించనక్కరలేదని ఎస్‌బీఐ ప్రకటించింది. ఇంతకుముందు విడుదల చేసిన జీఎస్టీ రేట్ల ప్రకారం రూ. 1000 లోపు బదిలీపై రూ. 5 చెల్లించాల్సి ఉండేది. కానీ చిన్న మొత్తాల బదిలీలను ప్రోత్సహించే ఉద్దేశంతో రూ. 5 చెల్లించనక్కర లేకుండా ఉచితంగా బదిలీ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఇక రూ. 1000 నుంచి రూ. లక్ష వరకు రూ. 5తో పాటు జీఎస్టీ, రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల బదిలీకి రూ. 15తో పాటు జీఎస్టీ యథావిధిగా చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ రాకతో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలపై 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది.