: ఎయిర్ లైన్స్ సంస్థల నిషేధంపై... హైకోర్టు మెట్లెక్కిన జేసీ దివాకర్ రెడ్డి


అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైకోర్టు మెట్లెక్కారు. తనపై ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించింది. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఇండిగో సిబ్బంది పట్ల దివాకర్ రెడ్డి దురుసుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయనపై 8 ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించాయి. మరోవైపు, ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించుకోవాలంటూ జేసీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సూచించారు.

  • Loading...

More Telugu News