: జగన్ హీరోగా, రోజా హీరోయిన్ గా సినిమా తీస్తే బాగుంటుంది!: టీడీపీ నేత అనురాధ ఎద్దేవా


వైసీపీ అధినేత జగన్, ఎమ్మెల్యే రోజాలు రాజకీయాలకు అనర్హులని ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్, టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ అన్నారు. 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండాలనే అత్యాశలో జగన్ ఉన్నారని... ఆయనది పేరాశగానే మిగిలిపోతుందని చెప్పారు. మద్యం వ్యాపారులను పక్కన పెట్టుకున్న జగన్ కు... చంద్రబాబు అనుసరిస్తున్న మద్య నియంత్రణ విధానంపై విమర్శలు చేసే హక్కు లేదని అన్నారు. రాష్ట్రాన్ని బాగుచేస్తామంటూ జగన్ తొమ్మిది హామీలను ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. డ్వాక్రా మహిళల గురించి మాట్లాడే నైతికత కూడా వైకాపా నేతలకు లేదని మండిపడ్డారు.

రోజా సినిమా భాషలో చెప్పాలంటే... అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదనే సినిమా డైలాగ్ ను రోజా గుర్తుంచుకోవాలని అనురాధ అన్నారు . మీ నాయకుడేమో అత్యంత అత్యాశపరుడని, మీకేమో ఎలాంటి భాషను వాడాలో కూడా తెలియదంటూ రోజాపై విమర్శలు గుప్పించారు. రోజా, జగన్ కలసి ఒక సినిమా తీస్తే బాగుంటుందని సూచించారు. ఈ సినిమాకు 'అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు' అనే టైటిల్ పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ఈ సినిమాలో హీరోగా జగన్, హీరోయిన్ గా రోజా నటించాలని అన్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, మ్యూజిక్ అన్నీ విజయసాయిరెడ్డి అందిస్తే ఇంకా బాగుంటుందని వ్యంగ్యంగా అన్నారు.

  • Loading...

More Telugu News