: ఆ క్యాషియర్ ను అంతా మనీ కౌంటింగ్ మెషీన్ అంటారు... అనుమానం ఉంటే ఈ వీడియో చూడండి!


డబ్బులు లెక్కపెట్టడంలో మనుషుల కంటే మెషీన్లే వేగంగా పని చేస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే నోట్ల కట్టలు లెక్కపెట్టడంలో మెషీన్ల కంటే తానే వేగంగా పని చేస్తానని చైనాలోని షాంగ్‌ డాంగ్‌ కి చెందిన ప్రైవేట్‌ బ్యాంక్‌ క్యాషియర్‌ నిరూపిస్తోంది. చైనా కరెన్సీ (యువాన్‌) లో 550 నోట్లను సెకెన్లలో లెక్కపెట్టడం ఆమె నైపుణ్యానికి నిదర్శనం. దీంతో చాలామంది ఆమెను క్యాషియర్‌ అని కాకుండా 'కౌంటింగ్‌ మెషిన్‌'గా పిలుస్తుంటారు.

బ్యాంకు కు వచ్చే వినియోగదారులు త్వరగా తమ పనైపోవడం కోసం ఆ యువతి వద్దకే వెళుతుంటారని వారు చెబుతున్నారు. దీంతో, మనీ కౌటింగ్ మెషీన్ కంటే వేగంగా ఆమె డబ్బులు లెక్కపెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. ఆమె నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే.

  • Loading...

More Telugu News