: విండోస్ స్మార్ట్ ఫోన్లు ఇక కనుమరుగేనా?


విండోస్ స్మార్ట్ ఫోన్లు భవిష్యత్తులో కనిపించకపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విండో ఫోన్లను వాడే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. పైగా విండోస్ 8.1 సాఫ్ట్ వేర్ పరంగా అప్ డేట్స్, సపోర్ట్ సేవలను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. ప్రస్తుతం మార్కెట్లో వాడుకలో ఉన్న మొత్తం విండోస్ ఆధారిత ఫోన్లలో 80 శాతం 8.1 వెర్షన్ పై పనిచేస్తున్నవే. తాజాగా మైక్రోసాఫ్ట్ తన సేవలను నిలిపివేసినందున సాఫ్ట్ వేర్ అప్ డేట్ కు వీలు పడదు. సెక్యూరిటీ ప్యాచెస్, బగ్ ఫిక్సేషన్ ఇతర సేవలు కూడా అందవు.

అయితే, మైక్రోసాఫ్ట్ మాత్రం లుమియా 1520, 930, 830, 735 ఫోన్లకు 10 వెర్షన్ అప్ డేషన్ కు అవకాశం ఇచ్చినట్టు చెబుతుండగా, చాలా వరకు ఫోన్లు కొత్త వెర్షన్ అందుకోకపోవడం లేదా అప్ డేట్ చేసుకోకపోవడం నెలకొందని అంచనా. నిజానికి ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత యాప్స్ విడుదలవుతున్నాయి గానీ విండోస్ యాప్స్ విడుదల కావడం లేదు. మైక్రోసాఫ్ట్ కూడా ఈ దిశగా అంత శ్రద్ధ కూడా చూపించడం లేదు.

  • Loading...

More Telugu News