: రాఘ‌వేంద్రరావు గురించి నేనేమీ త‌ప్పుగా మాట్లాడ‌లేదే!: తాప్సీ


`కొబ్బ‌రిచిప్ప‌ను బొడ్డు మీద వేయ‌డంలో శృంగారం ఏముంద‌నే విష‌యం నాకు ఇప్ప‌టికీ అర్థం కాలేదు` అంటూ ఓ యూట్యూబ్ కామెడీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో న‌టి తాప్సీ అన్న మాట‌ల‌ను ఆమె స‌మ‌ర్థించుకుంది. `రాఘ‌వేంద్ర‌రావు గారు చేసిందే నేను చెప్పాను. నాకు అలా అనిపించింది చెప్పేశాను, అంతే. ఈ విష‌యంపై ఆయన గానీ, నేను గానీ ఏ బాధ ప‌డ‌లేదు స‌రిక‌దా వీడియో చూసి న‌వ్వుకున్నాం. అన‌వ‌సరంగా ఆ విష‌యాన్ని మ‌ధ్య‌లో వాళ్లే వివాదం చేస్తున్నారు. అలాంటి వాళ్ల‌ని మేం ప‌ట్టించుకోం` అని తాప్సీ తెలిపింది.

తొలి చిత్రం కావ‌డం వ‌ల్ల ద‌క్షిణాది ద‌ర్శ‌కుల సృజ‌నాత్మ‌క‌త త‌న‌కు అర్థం కాలేద‌ని, రొమాన్స్‌ను ఇలా కూడా చూపిస్తారా? అని వీడియోలో తాప్సీ చెప్పిన మాట‌ల‌ను `నీకు అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుణ్ని ఇలా కించ‌ప‌రుస్తావా?`, `నీకు విశ్వాసం లేదు... నువ్వు బాలీవుడ్ వెళ్లింది ద‌క్షిణాది సినిమాల వ‌ల్ల‌నే అనే విష‌యం గుర్తుపెట్టుకో` అంటూ చాలా మంది విమ‌ర్శించారు. అంతేకాకుండా త్వ‌ర‌లో విడుద‌ల‌కానున్న త‌న సినిమా `ఆనందో బ్ర‌హ్మ‌`ను కూడా చూడ‌కుండా బ‌హిష్క‌రించాల‌ని కొంత‌మంది ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News