: 'మహోగని' మొక్కను నాటిన కేసీఆర్.. తెలంగాణలో హరితహారం-3 ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో విడత హరితహారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో మొక్కను నాటడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహోగని అనే ఔషధ మొక్కను కేసీఆర్ నాటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. ఎర్రవల్లి నుంచి కరీంనగర్ చేరుకున్న కేసీఆర్ కు ఈటల ఘన స్వాగతం పలికారు. 40 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా మూడో విడత కార్యక్రమం కొనసాగుతోంది. ఒక్క కరీంనగర్ లోనే లక్ష మొక్కలను నాటాలనే లక్ష్యం పెట్టుకున్నారు.