: గాంధీ, రాజాజీల మనవడు, విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!
గోపాలకృష్ణ గాంధీని 18 విపక్ష పార్టీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈయన అభ్యర్థిత్వాన్ని విపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. గోపాలకృష్ణకు సంబంధించిన విశేషాలలో ఇవి కొన్ని...
- మహాత్మాగాంధీ, సి.రాజగోపాలాచారిలకు గోపాలకృష్ణ గాంధీ మనవడు.
- గాంధీ చిన్న కొడుకు దేవదాస్ గాంధీ, రాజాజీ కూతురు లక్ష్మి దంపతులకు 1946 ఏప్రిల్ 22న ఈయన జన్మించారు.
- ఇంగ్లిష్ లిటరేచర్ లో మాస్టర్స్ చదివిన గోపాలకృష్ణ 1968లో ఐఏఎస్ అధికారిగా తన ఉద్యోగాన్ని ప్రారంభించారు.
- 1985-87 మధ్య భారత ఉపరాష్ట్రపతికి కార్యదర్శిగా, ఆ తర్వాత ఐదేళ్లు రాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా పని చేశారు.
- 1996లో దక్షిణాఫ్రికాలో భారత హైకమిషనర్ గా పని చేశారు.
- 1997-2000 మధ్య కాలంలో భారత రాష్ట్రపతికి కార్యదర్శిగా వ్యవహరించారు.
- 2000 సంవత్సరంలో శ్రీలంకలో భారత హైకమిషనర్ గా, 2002లో నార్వే, ఐస్ లాండ్ అంబాసడర్ గా పని చేశారు.
- 2004 నుంచి 2009 వరకు పశ్చిమబెంగాల్ గవర్నర్ గా పదవీ బాధ్యతలను నిర్వర్తించారు.
- గోపాలకృష్ణ గాంధీ, తారాగాంధీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.