: ఇదో చిత్రం... మోదీ గురించి వాదించుకుని పెళ్లి రద్దు చేసుకున్నారు!


చిన్ని చిన్న విషయాలకే వివాహ బంధాలు బద్దలవుతున్న సంగతి తెలిసిందే. అయితే సంసారంతో ఏమాత్రం సంబంధం లేని విషయానికి వాదులాడుకుని వివాహాన్ని రద్దు చేసుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... లక్నోలోని ప్రభుత్వోద్యోగినికి కాన్పూర్ కు చెందిన వ్యాపారవేత్తతో వివాహం కుదిరింది. అయితే వివాహానికి ముందు అభిప్రాయాలు పంచుకునేందుకు ఇద్దరూ ఒక గుడి దగ్గర కలుసుకున్నారు.

ఈ క్రమంలో వివిధ విషయాలపై చర్చించుకుంటున్న దశలో రాజకీయాలతో పాటు మోదీపైకి టాపిక్ మళ్లింది. దీంతో మోదీకి అనుకూలంగా ఒకరు, ప్రతికూలంగా మరొకరు వ్యాఖ్యలు చేసుకున్నారు. ఇవి చిలికిచిలికి గాలివానగా మారింది. దీంతో ఇద్దరూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయి, తమ అభిప్రాయాలు కలవడం లేదంటూ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు వివాహానికి.. వాగ్వాదానికి దిగిన విషయానికి ఏమాత్రం సంబంధం లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అవేవీ పట్టించుకోని సదరు యువతీ యువకులు తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో మోదీ గురించి గొడవపడి వివాహం రద్దు చేసుకోవడమేంటని దీని గురించి తెలిసినవారంతా ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News