: కోదండరామ్ తో భేటీ అయిన గద్దర్
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తో ప్రజా గాయకుడు గద్దర్ భేటీ అయ్యారు. వీరి సమావేశం హైదరాబాద్ తార్నాకలోని కోదండరామ్ నివాసంలో జరిగింది. చర్చల సందర్భంగా 'ప్రజల్లోనే ఉందాం, ప్రజలతోనే ఉందాం' అని కోదండరామ్ తో గద్దర్ అన్నారు. భేటీ అనంతరం మీడియాతో గద్దర్ మాట్లాడుతూ, తమ మధ్య రాజకీయపరమైన చర్చలు జరగలేదని అన్నారు. ప్రజా సమస్యలు, రాష్ట్ర సమస్యలపై ప్రొఫెసర్ తిరుపతిరావుతో చర్చించి వస్తూ... మార్గమధ్యంలో కోదండరామ్ ను కలిశానని చెప్పారు.