: జమ్ముకశ్మీర్ లో హోరాహోరీ కాల్పులు.. ముగ్గురు ముష్కరుల హతం
నిత్యం ఉగ్రదాడులతో అట్టుడుకుతున్న జమ్ముకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుద్గామ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో భారత భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో, ముగ్గురు ముష్కరులను సైనికులు మట్టుబెట్టారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మరికొందరు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.