: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి గురించి 10 ఆసక్తికర విషయాలు...!


టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సెహ్వాగ్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ చివరకు ఆ పదవి రవిశాస్త్రినే వరించింది. రవిశాస్త్రిని హెడ్ కోచ్ గా నియమిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. గతంలో 18 నెలల పాటు టీమిండియా డైరెక్టర్ గా వ్యవహరించడం రవిశాస్త్రికి లాభించింది. హెడ్ కోచ్ రవిశాస్త్రి గురించిన 10 విషయాలు.
  • 1962 మే 27వ తేదీని రవిశాస్త్రి జన్మించాడు. అతని పూర్తి పేరు రవి శంకర్ జయద్రిత శాస్త్రి. 
  • అతి తక్కువ కాలంలోనే బాంబే రంజీ జట్టులోకి అడుగు పెట్టడం వల్ల... అతనికి సంబంధించిన స్కూలు, క్లబ్ రికార్డులు అందుబాటులో లేవు. 17 ఏళ్ల వయసులోనే శాస్త్రి బాంబే రంజీ టీముకు ఆడాడు.
  • ఎత్తుగా, అందంగా ఉండే రవిశాస్త్రి ఆ రోజుల్లో పోస్టర్ బాయ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గా ఓ వెలుగు వెలిగాడు. సినీ నటి అమృతా సింగ్ తో అతని ప్రేమాయణం బహిరంగ విషయమే. 
  • లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా కెరియర్ ను ప్రారంభించిన శాస్త్రి తొలినాళ్లలో 10వ స్థానంలో బ్యాటింగ్ కు దిగేవాడు. టెస్టుల్లో అడుగుపెట్టిన 18 నెలల్లోనే మంచి బ్యాట్స్ మెన్ గా రవిశాస్త్రి గుర్తింపు తెచ్చుకున్నాడు. రిటైర్ అయ్యేనాటికి... ఒకటో స్థానం నుంచి పదో స్థానం వరకు బ్యాటింగ్ చేసిన రికార్డును నమోదు చేశాడు. ప్రతి స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 
  • తొలి టెస్టుల్లో 10వ నంబర్ బ్యాట్స్ మెన్ గా క్రీజులోకి వచ్చిన శాస్త్రి... రెండేళ్ల కాలంలోనే ఓపెనర్ గా బరిలోకి దిగాడు.
  • 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన 'ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్' సిరీస్ శాస్త్రికి బాగా గుర్తుండి పోతుంది. ఆ సిరీస్ లో ఇండియా అన్ని మ్యాచ్ లలో గెలవగా... బెస్ట్ పెర్మార్మర్ గా శాస్త్రి నిలిచాడు. 182 పరుగులు చేయడమే కాక, 8 వికెట్లు పడగొట్టాడు. ఆడి 100 కారును బహుమతిగా పొందాడు. 
  • మొత్తం మీద 80 టెస్టులు ఆడిన రవిశాస్త్రి 3,830 పరుగులు చేయడమే కాక, 151 వికెట్లను పడగొట్టాడు. 150 వన్డేల్లో 3,108 పరుగులు సాధించి 129 వికెట్లను పడగొట్టారు. మోకాలి గాయంతో 30 ఏళ్ల వయసులో బలవంతంగా కెరియర్ కు ముగింపు పలికాడు. 
  • ఆటగాడిగా కెరియర్ ముగిసిన తర్వాత కామెంటేటర్ అవతారమెత్తిన శాస్త్రి... ఇప్పటికీ టీవీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. 
  • 2008 ఒలింపిక్స్ సందర్భంగా ఒమన్ లో నిర్వహించిన ఒలింపిక్స్ టార్చ్ ర్యాలీలో సెలబ్రిటీ టార్చ్ బేరర్ గా శాస్త్రి పాల్గొన్నాడు. 
  • యూనిసెఫ్ జాతీయ గుడ్ విల్ అంబాసడర్ గా శాస్త్రి వ్యవహరిస్తున్నాడు. ఈ ఘనతను సొంతం చేసుకున్న మరో భారతీయ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే.

  • Loading...

More Telugu News