: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీఆర్ఎస్ నేత కోడలు దుర్మరణం!


అమెరికాలోని న్యూజెర్సీలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం(బి) గ్రామానికి చెందిన రత్న జ్యోతి దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో ఆమె భర్త సునీల్ సాగర్, కుమారుడు దైవిక్ సాగర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. దైవిక్ వయసు 21 నెలలు మాత్రమే. టీఆర్ఎస్ నాయకులు ప్రొఫెసర్ గోపాలం కుమారుడే సునీల్ సాగర్.

న్యూయార్క్ లోని ఐసీఐసీఐ బ్యాంకులో ట్రెజరీ మేనేజర్ గా సునీల్ పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి షాపింగ్ ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్ లో ఉంటున్న వారి బంధువులు ప్రమాదం విషయాన్ని ఇక్కడున్న బంధువులకు తెలియజేశారు. సునీల్ సాగర్ దంపతులు గతంలో బహ్రెయిన్ లో మూడేళ్ల పాటు ఉద్యోగాలు చేశారు. 

  • Loading...

More Telugu News