: పోర్న్‌హబ్ వీడియోలు చూడాలంటే ఇక పాస్‌పోర్ట్ కావాల్సిందే.. రష్యాలో సరికొత్త నిబంధన!


రష్యాలో పోర్న్‌హబ్ యూజర్లకు కొత్త కష్టం వచ్చి పడింది. ఇక నుంచి అందులోని వీడియోలు చూడాలంటే తప్పనిసరిగా తమ పాస్‌పోర్ట్‌, సెల్‌ఫోన్‌లలో పేర్కొన్న సోషల్ మీడియా ఖాతాతో లాగిన్ అవాల్సి ఉంటుంది. భద్రతా కారణాల రీత్యా పోర్న్‌హబ్ ఈ నిర్ణయం తీసుకుంది. పోర్న్‌హబ్‌కు- రష్యా ప్రభుత్వానికి జరుగుతున్న పోరులో ఈ సరికొత్త నిబంధన తెరపైకి వచ్చింది. రష్యా గతేడాదే ఈ అడల్ట్ వీడియో సైట్‌ను నిషేధించింది.

ఈ ఏప్రిల్‌లో తిరిగి ప్రారంభమైన పోర్న్‌హబ్ రష్యా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తన సైట్‌లో ఏకంగా పెద్ద డాక్యుమెంటరీనే అప్‌లోడ్ చేసింది. కాగా, పోర్న్‌హబ్ తాజాగా చేసిన ప్రకటన అందరినీ విస్మయ పరుస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఇక నుంచి తమ సైట్‌లోకి సోషల్ మీడియా ద్వారా మాత్రమే లాగిన్ కావాల్సి ఉంటుందని తెలిపింది. డేటాఫ్ బర్త్‌తో సైట్‌లోకి ఎంటర్ కాలేరని తేల్చి చెప్పింది. దీనివల్ల సైట్‌లోకి వేగంగా లాగిన్ కావచ్చని, సైట్‌ను ఎవరు వీక్షిస్తున్నారో తెలుసుకోవడం ప్రభుత్వానికి సులభతరమవుతుందని వివరించింది. తాజా నిబంధనలు ప్రభుత్వం విధించినవి కావని, అయితే రష్యాలోని చట్టాలకు ఇవి అనుగుణంగా ఉన్నాయని పోర్న్‌హబ్ వైస్ ప్రెసిడెంట్ కోరీ ప్రైస్ తెలిపారు.

  • Loading...

More Telugu News