: విమానంలో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన మరో మహిళ.. ఎనిమిది నెలల గృహ నిర్బంధం విధిస్తూ తీర్పు!


విమానంలో సాటి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన మరో మహిళకు న్యాయస్థానం ఎనిమిది నెలల గృహ నిర్బంధం విధించింది. అమెరికాలోని లాస్ వెగాస్ నుంచి పోర్ట్‌ల్యాండ్ వెళ్తున్న విమానంలో ఓరెగాన్‌కు చెందిన హీడీ మెక్‌కిన్నీ (27) తన పక్క సీట్లోని మహిళతో అసభ్యంగా ప్రవర్తించింది. ఆమెను అసహ్యంగా తాకింది. పెదాలతో తడిమింది. ఆమె ప్రవర్తనపై 19 ఏళ్ల బాధితురాలు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది.

దీంతో పోర్ట్‌ల్యాండ్‌లో విమానం ల్యాండ్ కాగానే అధికారులు కిన్నీని అదుపులోకి తీసుకున్నారు. మే 8న ఈ ఘటన జరిగింది. ఈ కేసులో నిందితురాలిని దోషిగా తేల్చిన ఫెడర్ కోర్ట్ హౌస్ ఆమెకు 8 నెలల గృహ నిర్బంధం విధించింది. అలాగే ఆమెపై మూడేళ్ల పాటు ప్రొబేషన్ విధించారు. కిన్నీ ప్రవర్తనతో తాను షాక్ తిన్నానని బాధితురాలు పేర్కొంది. ఆమె తన చెవిని పెదవులతో అందుకుందని, ఎక్కడెక్కడో తడిమిందని పేర్కొంది. దీంతో తనకు వేరే సీటు ఇవ్వాల్సిందిగా విమాన సిబ్బందిని కోరానని తెలిపింది.

  • Loading...

More Telugu News