: దిలీప్ అరెస్టు భావనకు దక్కిన విజయం: నటి రమ్య నంబీశన్ కీలక వ్యాఖ్య


సినీ నటి భావన లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ మలయాళ స్టార్ హీరో దిలీప్ అరెస్టు అనంతరం అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అతనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో భావనపై జరిగిన లైంగిక దాడిపై మాట్లాడేందుకు ఇన్నాళ్లూ సంకోచించిన పలువురు నటీనటులు ఇప్పుడు ముందుకు వచ్చి నోరువిప్పుతున్నారు. తాజాగా మరో హీరోయిన్ రమ్య నంబీశన్ భావనకు మద్దతు పలికింది.

సోషల్ మీడియా ద్వారా ఆమె స్పందిస్తూ, ‘అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన భావనకు దక్కిన విజయమిది. నిజం ఎప్పటికైనా బయటపడుతుందనే నమ్మకంతోనే ఇంతకాలం పాటు వేచి చూశాం. ఎట్టకేలకు నిజం నిగ్గుతేలింది. హ్యాట్సాప్‌.. కేరళ పోలీసులు.. మేం ఎప్పుడూ భావనకు మద్దతుగా వుంటాం’ అంటూ పేర్కొంది.

  • Loading...

More Telugu News