: కోహ్లీ కోరిక నెరవేరింది... కొత్త కోచ్ రవిశాస్త్రే.... ద్రవిడ్, జహీర్ లకు కొత్త బాధ్యతలు!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరిక నెరవేరింది. 2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో వైఫల్యంతో టీమిండియా డైరెక్టర్ పదవి నుంచి తప్పించిన రవిశాస్త్రినే మళ్లీ కుంబ్లే వారసుడిగా నియమించారు. రవిశాస్త్రిని టీమిండియా చీఫ్ కోచ్ గా నియమించినట్టు బీసీసీఐ ప్రకటించింది. రవిశాస్త్రితో పాటు జహీర్ ఖాన్, రాహుల్ ద్రవిడ్ కు కూడా బీసీసీఐ కొత్త బాధ్యతలు కట్టబెట్టింది. 2019 వరల్డ్ కప్ లక్ష్యంగా జరిగిన ఈ ఎంపికలో టీమిండియా చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి బాధ్యతలు నిర్వర్తించనుండగా, జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. బ్యాటింగ్ కన్సల్టెంట్ గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తాడు.