: ఇదే ఆఖరి పోరాటం.. చావోరేవో తేల్చుకుంటాం!: ముద్రగడ పద్మనాభం
ఇదే ఆఖరి పోరాటమని, ప్రభుత్వంతో చావోరేవో తేల్చుకుంటామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కాపు ఐక్యవేదిక విద్యార్థి అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, కాపులను అణగదొక్కి, ఇతర కులాల్లో భయం సృష్టించాలని చూస్తున్నారని, కాపు ఉద్యమాన్ని ఎంతగా అణగదొక్కితే, అంత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే, పోలీసులను మోహరిస్తారా? అని ప్రశ్నించారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే, చంద్రబాబుకు చీమకుట్టినట్టయినా లేదంటూ మండిపడ్డారు.