: నెటిజన్ ప్రశ్నకు సుష్మాస్వరాజ్ భర్త భలే సమాధానమిచ్చారు!


ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ భలే సమాధానమిచ్చారు. ఇంతకీ, ఆ ప్రశ్న ఏంటంటే..‘సుష్మాస్వరాజ్‌, మీ జీతం ఎంత?’ అంటూ కౌశల్ కు ట్వీట్ చేశాడు. కౌశల్ తన దైన శైలిలో.. ‘నా వయసు.. మేడం జీతం ఎప్పుడూ అడగకూడదు. అది మంచి పద్ధతి కాదు’ అని రిప్లై ఇచ్చారు. కౌశల్ స్వరాజ్ చెప్పిన ఈ సమాధానానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

కాగా, గతంలో సుష్మాస్వరాజ్‌కు కిడ్నీ ఆపరేషన్‌ జరిగే సమయంలో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు కౌశల్ స్వరాజ్ కొంత ఘాటుగానే స్పందించారు. ‘ఆపరేషన్‌ను లైవ్‌స్ట్రీమింగ్‌ పెట్టాలా ఏంటీ!’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో సంఘటనలో ఓ నెటిజన్‌ అదే పనిగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ‘మీరేమైనా ఆర్టీఐ కార్యకర్తా?’ అంటూ కౌశల్‌ ప్రశ్నించడం గమనార్హం.

  • Loading...

More Telugu News