: అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి అమానుషం: వెంకయ్యనాయుడు
అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడటం అమానుషమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దాడి వెనుక ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉందని, ఉగ్రవాదులకు పొరుగు దేశం నుంచి సహకారం అందుతోందని అన్నారు. గత ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్లే కశ్మీర్ సమస్య రావణకాష్టంలా మండుతూనే ఉందని విమర్శించారు. కశ్మీర్ సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు.