: కాలేజీ యాజమాన్యం వేధింపులతో మరో విద్యార్థి ఆత్మహత్య
కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగా మరో విద్యార్థి బలి అయ్యాడు. ఇటీవలే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని శ్రీ ఇందూ ఇంజినీరింగ్ కళాశాలలో చైతన్య అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నాగులవరంలో బీటెక్ విద్యార్థి సాంబయ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే ఆ విద్యార్థి ఈ ఘటనకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో తమ కుమారుడు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు.