: నేరగాడి కోరిక తీర్చిన పోలీసులు.. సంకెళ్లతోనే గర్ల్‌ఫ్రెండ్‌ కి ప్రపోజ్ చేసిన వైనం!


ఆరు నేరాలకు పాల్పడిన కేసులో ఓ నేర‌గాడు అతని బర్త్ డే రోజునే పోలీసులకు దొరికిపోయాడు. అయితే, పోలీసులను విచిత్రమైన కోరిక కోరాడు. తాను ప్రేమించిన‌ మ‌హిళ‌కు ఐ ల‌వ్ యూ చెప్పుకుంటాన‌ని అన్నాడు. పోలీసులు అందుకు అంగీక‌రించ‌డంతో పోలీస్ కారులోనే త‌న ప్రియురాలి ఇంటికి వెళ్లి ప్ర‌పోజ్ చేశాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని ఓక్లహామాలో చోటు చేసుకుంది. బ్రాండన్ థామ్సన్ అనే వ్యక్తి తన వద్దకు అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో తనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే ముందు తన స్నేహితురాలు లియాండ్రియా కీత్ ను కలుస్తానని అన్నాడు.

తన ప్రేమ విషయం చెబుతానని బతిమిలాడుకున్నాడు. దాంతో పోలీసుల మనసు కరిగింది. అయితే, అతడి చేతులకు వేసిన సంకెళ్లు మాత్రం పోలీసులు విప్పలేదు. తన ప్రియురాలి దగ్గరకు వెళ్లి ఆమె చేతులు ప‌ట్టుకుని ప్ర‌పోజ్ చేశాడు. దీంతో లియాండ్రియా కూడా ఓకే చెప్పింది. అనంత‌రం ఆ నేర‌గాడు పోలీసు వాహనం ఎక్కి పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లిపోయాడు.       

  • Loading...

More Telugu News