: మెహబూబా ముఫ్తీపై సుబ్రహ్మణ్యస్వామి ఫైర్


జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. ముఫ్తీ ప్రభుత్వ వైఫల్యం వల్లే అనంతనాగ్ లో అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిందని అన్నారు. జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్ లో ప్రజల ప్రాణాలకు భద్రత కరవైందని అన్నారు. మరోవైపు, ఉగ్రదాడిపై మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, కాశ్మీరీలంతా సిగ్గుతో తల దించుకోవాల్సిన ఘటన ఇదని చెప్పిన సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News