: సినిమాల్లో ఇప్పుడే నాకు మొదటిసారి పెళ్లయింది!: రానా దగ్గుబాటి
‘బాహుబలి’తో నటుడు రానా ఒక రేంజ్ లో పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే, మరోపక్క ‘నెం.1 యారి విత్ రానా’ అనే టీవీ షోకు వ్యాఖ్యాతగా కూడా రానా వ్యవహరిస్తున్నాడు. కేవలం సెలెబ్రిటీలు మాత్రమే పాల్గొనే ఈ షోలో రానా పెళ్లి గురించిన ప్రస్తావన వచ్చింది. రానా సినిమాల్లో మాత్రమే పెళ్లి చేసుకుంటాడని, నిజ జీవితంలో చేసుకోడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇందుకు రానా స్పందిస్తూ ..‘ మీకో విషయం తెలుసా?. నాకు సినిమాల్లో ఫస్ట్ టైమ్ పెళ్లయింది..ఈ సారే, తేజగారి సినిమాలోనే. ఇంకా చెప్పాలంటే, నాకు సినిమాల్లో కూడా సరిగ్గా పెళ్లవలేదు. ‘బాహుబాలి’ లాంటి సినిమాలో కూడా కొడుకు వచ్చి అటుఇటూ తిరుగుతున్నా నాకు వైఫ్ లేకుండా పోయింది’ అని చెప్పడంతో నవ్వులు విరిశాయి.