: 'పాన్' కార్డుకి అప్లై చేయాలా?... ఐతే ఈ యాప్ డౌన్‌లోడ్ చేయండి!


ఆదాయ పన్ను చెల్లించ‌డానికి, పాన్ కార్డ్ కోసం, లేదా మ‌రేదైనా ప‌న్నుల సంబంధిత ఫిర్యాదు న‌మోదు కోసం ఇక‌ పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌న‌క్క‌ర్లేదు. మీ ఫోన్‌లో సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వారి యాప్ ఓపెన్ చేస్తే చాలు. పన్ను చెల్లింపుదారుల సౌక‌ర్యార్థం సీబీడీటీ వారు ప్ర‌త్యేకంగా ఓ యాప్ విడుద‌ల చేశారు. `ఆయ్‌క‌ర్ సేతు` అనే ఈ యాప్ ద్వారా పాన్‌కార్డ్ నెంబ‌ర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకునే స‌దుపాయం కూడా క‌ల్పించారు. అలాగే టీడీఎస్ వివ‌రాలు కూడా తెలుసుకోవ‌చ్చు.

ప‌న్ను చెల్లింపుదారుల‌కు, ఆర్థిక శాఖ‌కు మ‌ధ్య వార‌ధిగా ప‌నిచేసే ఈ యాప్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్క‌రించారు. ఈ యాప్‌లో పాన్‌, టాన్‌, టీడీఎస్‌, రిట‌ర్న్ ఫైలింగ్‌ల‌కు సంబంధించిన సందేహాల‌ను తీర్చేందుకు `చాట్ బోట్‌` అనే సౌక‌ర్యం కూడా క‌ల్పించారు. దీంతో వినియోగదారులు స్వ‌యంగా చాట్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవ‌చ్చు. అలాగే నిపుణుల‌తో కూడా మాట్లాడే స‌దుపాయం ఉంది. ఈ యాప్‌లో మొబైల్ నెంబ‌ర్‌ను రిజిస్ట‌ర్ చేయ‌డం ద్వారా ప‌న్ను చెల్లింపు చివ‌రి తేదీలు, ఇత‌ర ముఖ్యమైన అప్‌డేట్లు మెసేజ్ ద్వారా పొంద‌వ‌చ్చు. సీబీడీటీ వారు రూపొందించిన ఈ మొద‌టి ఆండ్రాయిడ్‌ మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి గానీ, 7306525252 నెంబ‌ర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి గానీ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

  • Loading...

More Telugu News