: వైసీపీలో చేరనున్నాననే వార్తలను కొట్టిపారేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైసీపీలో చేరనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనతో పాటు ఆయన భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్రరెడ్డిలు కూడా వైసీపీలోకి వెళుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీతో చర్చలు పూర్తయ్యాయని, కోట్లను ఘనంగా పార్టీలోకి ఆహ్వానించాలని జగన్ కూడా నిర్ణయించుకున్నారని ప్రచారం చేస్తున్నారు.
ఈ వార్తలపై కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్పందించారు. గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి సంబంధం ఉందని కోట్ల గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే... వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తానే తప్ప, పార్టీ మారే ఆలోచన కూడా చేయబోనని ఆయన స్పష్టం చేశారు.