: ఎంపీ టిక్కెట్టు అంటే రైలు, బస్సు టిక్కెట్టు కాదు
మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి విశాఖ ఎంపీ టిక్కెట్టును ఆరు నూరైనా.. నూరు ఆరైనా సొంతం చేసుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరోసారి విశాఖ టిక్కెట్టుపై తన మోజును వ్యక్తం చేశారు. ఎంపీ టిక్కెట్టు అంటే రైలు, బస్సు టిక్కెట్టు కాదని, పనిచేసే వారికే విశాఖ టిక్కెట్టు ఇస్తారని అన్నారు.