: ప్రభుత్వ అధికారిపై చేప విసిరికొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు!


ముంబైలో ఓ ప్రభుత్వ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపైకి చేప విసిరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నితేష్ రాణేను పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. రాణే సహా మొత్తం 23 మందిని అరెస్టు చేసి కొంకణ్ కోర్టులో హాజరుపరిచారు. మత్స్యశాఖకు చెందిన కమిషనర్ తో మాట్లాడుతున్న సందర్భంలో సహనం కోల్పోయిన రాణే ఈ చర్యకు పాల్పడ్డారు. సదరు కమిషనర్ పై చేయి చేసుకున్నంత పని చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారడంతో రాణేపై చర్యలు తీసుకోక తప్పలేదు. పలు సెక్షన్ల కింద రాణేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News