: రేపే చంద్రబాబుని రాజీనామా చేయమనండి.. జగన్‌ని కుర్చీలో కూర్చోబెట్టమనండి.. చూద్దాం!: రోజా
తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్న ప్లీనరీలో ప్రకటించిన హామీలపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారని, అవి నెరవేరని హామీలంటూ మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఏపీ మంత్రులు అందరూ వరుసగా తాము చేసిన హామీలపై విమర్శలు చేశారని ఆమె అన్నారు. తాము ఆ హామీలు తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. ‘రేపే చంద్రబాబుని రాజీనామా చేయమనండి.. జగన్‌ని కుర్చీలో కూర్చోబెట్టమనండి, ఎలా అమలు చేస్తారో చేసి చూపిస్తారు’ అని రోజా అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తోన్న టీడీపీ నేతలకు మేము ఇచ్చిన హామీలపై మాట్లాడే అర్హత ఉందా? అని రోజా ప్రశ్నించారు. జగన్ అన్న ఇచ్చిన హామీలన్నీ అమలై తీరుతాయని ఆమె వ్యాఖ్యానించారు.