: భ‌ద్ర‌తా లోపం వల్లే ఈ దాడి జరిగింది: రాహుల్ గాంధీ


అమ‌ర్‌నాథ్ యాత్రికుల‌పై జ‌రిగిన దాడి భద్రతా లోపం వల్లే జరిగిందని ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ దాడి ప‌ట్ల ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ బాధ్య‌త వ‌హించాల‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా డిమాండ్ చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఉగ్ర‌దాడులతో భార‌త్ భ‌య‌ప‌డదని కూడా పేర్కొన్నారు. ఇదే ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేత ర‌ణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ... కేంద్ర స‌ర్కారు, ప్ర‌భుత్వ ద‌ళాల భ‌ద్ర‌తా లోపం వ‌ల్లే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని అన్నారు.  

  • Loading...

More Telugu News