: ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుంటే బస్సు డ్రైవర్ ఏం చేశాడంటే...!


అమర్ నాథ్ యాత్ర ముగించుకుని వైష్ణోదేవి ఆలయానికి బయల్దేరిన బస్సుపై లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పంజా విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ, మలుపు తిరిగి సాఫీగా వెళ్తున్న బస్సుపై మాటు వేసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారని తెలిపారు. కాల్పుల శబ్దం వినపడగానే ప్రయాణికులు భయకంపితులయ్యారని, అయితే బస్సు డ్రైవర్ మాత్రం బస్సును ఏమాత్రం వేగం తగ్గకుండా వేగంగా కిలోమీటర్ దూరం నడిపాడని వారు చెప్పారు.

బస్సు డ్రైవర్‌ సలీమ్‌ బంధువు జావెద్‌ గుజరాత్‌ లో దీనిపై మీడియాతో మాట్లాడారు. ‘సలీమ్‌ ఆ ఏడుగురి ప్రాణాలను కాపాడలేకపోవచ్చు. కానీ, 50 మందిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని అన్నారు. ఆయనను చూస్తే గర్వంగా ఉందని చెప్పిన ఆయన జరిగిన దారుణం గురించి నేటి ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఫోన్‌ చేసి, దాడి గురించి వివరించాడని తెలిపారు. యాత్రికులను రక్షించాలన్న లక్ష్యంతోనే భయపడకుండా, బస్సు ఆపకుండా పోనిచ్చానని చెప్పాడని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News