: కోహ్లీ సేనకు అదిరిపోయే పార్టీ ఇచ్చిన క్రిస్ గేల్!
టీమిండియా వెస్టిండీస్ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా భారత క్రికెటర్లకు వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ అదిరిపోయే పార్టీ ఇచ్చాడు. ఇరు దేశాల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జమైకాలో జరిగిన సంగతి తెలిసిందే. గేల్ ది కూడా జమైకానే. దీంతో, మ్యాచ్ ముగిసిన వెంటనే కోహ్లీ సేనను గేల్ తన ఇంటికి ఆహ్వానించాడు. గేల్ ఇచ్చిన పార్టీలో మన ఆటగాళ్లు ఎంతో ఎంజాయ్ చేశారు. ఐపీఎల్ లో బెంగళూరు తరపున ఆడుతున్న గేల్ కు భారత క్రికెటర్లతో చాలా సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో, వీరందరినీ గేల్ తన ఇంటికి ఆహ్వానించి, విందుతో అలరింపజేశాడు. అంతకు ముందు వన్డే సిరీస్ జరుగుతున్న సమయంలో మరో విండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో కూడా మన క్రికెటర్లకు విందు ఇచ్చిన సంగతి తెలిసిందే.