: కుప్పకూలిన అమెరికా సైనిక విమానం!


16 మందితో ప్రయాణిస్తున్న అమెరికా సైనిక విమానం కుప్పకూలింది. లెఫ్లోర్ లోని తీర ప్రాంత దళానికి చెందిన కేసీ - 130 రవాణా విమానం కూలిపోయిందని యూఎస్ మెరైన్స్ ఒక ట్విట్టర్ లో తెలిపింది. ఈ విమానాన్ని ఇంధన రవాణా కోసం వాడుకుంటున్నామని పేర్కొంది. విమానంలో 16 మంది సైనికులు ఉన్నారని, దేశ పౌరులు ఎవరైనా ఉన్నారా? అన్న విషయం తెలియరాలేదని మెరైన్స్ డైరెక్టర్ ఫ్రాంక్ రాండెల్ తెలిపారు. మిసిసిపీ ప్రాంతంలో విమానం కూలగా, విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. ఇప్పటివరకూ 12 మంది మృతదేహాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. కాగా, విమానం ఎందుకు కూలిందన్న విషయమై కారణాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News