: అమర్‌నాథ్ ఉగ్రదాడిని ఖండించిన చంద్రబాబు
అమర్‌నాథ్ యాత్రికులపై తీవ్రవాదులు దాడి చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త తనని తీవ్రంగా కలచివేసిందని, బాధితులకు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలుపుతున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి ఉగ్రదాడులను రాజకీయ, రాజకీయేతర పార్టీలు కూడా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. నిందితులకు ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని ఆయన మరో ట్వీట్‌లో ఆకాక్షించారు.