: 'జై' కేరక్టర్ వివాదం: ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ ల మధ్య రాజీ కుదిరిందట!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాబి ఈ సినిమాకు దర్వకత్వం వహిస్తుండగా, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై, యూట్యూబ్ లో దూసుకుపోయింది. అయితే, గతంలో తాను చెప్పిన ఓ ఐడియాను ఈ సినిమాలో 'జై' కేరక్టర్ కి ఎన్టీఆర్ ఉపయోగించుకున్నాడని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆరోపించినట్టు ఓ ఆంగ్ల పత్రికలో కథనం రావడం సంచలనం రేపింది.

ఈ నేపథ్యంలో, ఈ విషయంపై ఇద్దరూ మాట్లాడుకుని రాజీ కుదుర్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, పూరీకి మరోసారి దర్శకత్వం అవకాశం ఇస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చాడట. దీనికి పూరీ కూడా ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారం అయిపోయింది. ఇకపై ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడబోనని ఎన్టీఆర్ కు పూరీ జగన్నాథ్ హామీ ఇచ్చాడట.

  • Loading...

More Telugu News