: పెళ్లి నాకు వింతగా అనిపిస్తుంది... తాత్కాలిక బంధానికే నా ఓటు!: బాలీవుడ్ నటుడు


బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా వివాహం గురించి తన అభిప్రాయం బయటపెట్టి మీడియాను షాక్ కు గురిచేశాడు. శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందిన 'మామ్' సినిమాలో కీలక పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా సుదీర్ఘ కాలం తరువాత మీడియా ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ, తనకు వివాహం చేసుకోవాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశాడు. జీవితంలో వివాహం చేసుకోనని తేల్చిచెప్పాడు. తాను ఒంటరిగా జీవించేందుకు ఇష్టపడతానని అన్నాడు. వివాహం లేదా ప్రేమ తన జీవితంలోకి వచ్చినా దానిని కొనసాగించలేననేది తన బలమైన నమ్మకమని అక్షయ్ ఖన్నా తెలిపాడు.

వివాహ బంధాన్ని జీవితాంతం కొనసాగించడం అందరికీ సర్వసాధారణమైనదైనా తనకు మాత్రం వింతగా అనిపిస్తుందని చెప్పాడు. ఒకరితో బంధం కొనసాగించిన తరువాత ఇద్దరూ ఇష్టపడి విడిపోవడం, తర్వాత మరో కొత్త వ్యక్తితో మరో బంధం ఏర్పర్చుకోవడం తనకు నచ్చుతుందని అక్షయ్ ఖన్నా చెప్పడంతో అంతా షాకైపోయారు. కాగా, 'హిమాలయ్ పుత్ర' సినిమాతో 1997లో బాలీవుడ్ లో వినోద్ ఖన్నా వారసుడిగా అరంగేట్రం చేసిన అక్షయ్ ఖన్నా ఆ తరువాత 'తాళ్', 'బోర్డర్', 'మొహబ్బత్', 'కుద్రత్', 'దిల్ చహతాహై' వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి స్టార్  గా ఒక వెలుగు వెలిగాడు. అనంతరం సినిమాల నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి ఆకట్టుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News