: "వెల్ కమ్ టూ సెంట్రల్ జైల్"... హీరో దిలీప్ చిత్రం టైటిలే అక్కడ స్లోగన్!


'వెల్ కమ్ టూ సెంట్రల్ జైల్'... మాలీవుడ్ నటుడు దిలీప్ నటించిన తాజా చిత్రం. గత సంవత్సరం ఈ సినిమా విడుదలై మంచి వసూళ్లనే సాధించింది. అప్పటి నుంచి దిలీప్ నటించిన మరో చిత్రమేమీ విడుదల కాలేదు. ఇక నటి భావనపై అత్యాచారం కేసులో దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్న వేళ, అలువ కారాగారం ముందు చేరిన సినీ అభిమానులు 'వెల్ కమ్ టూ సెంట్రల్ జైల్' అంటూ నినాదాలతో హోరెత్తించారు. దిలీప్ తాజా చిత్రం టైటిలే, అతని జైలు స్వాగత నినాదం కావడం కాకతాళీయం. ఇక, భావనకు మద్దతుగా సినీ రంగంలోని మహిళలు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ సహ నటికి న్యాయం జరగాలని, విచారణ కొనసాగి, నిందితులకు వ్యతిరేకంగా పూర్తి సాక్ష్యాలను సేకరించి, వారిని శిక్షించాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News