: పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చింది కమేడియన్ ప్రవీణ్ కేనా?
ఓ సినిమా షూటింగ్ లో తన వద్దకు వచ్చి 'జనసేన' పార్టీపై వివరాలు అడిగిన ఓ కమెడియన్ పై హీరో పవన్ కల్యాణ్ రెచ్చిపోయారన్నది ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అత్యధికంగా వైరల్ అవుతున్న వార్త. షూటింగ్ గ్యాప్ లో ఏదో విషయాన్ని సీరియస్ గా మాట్లాడుకుంటున్న వేళ, వచ్చి డిస్టర్బ్ చేసిన కామెడీ ఆర్టిస్టును, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోనని కూడా పవన్ హెచ్చరించాడని నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే, సదరు కమెడియన్ ఎవరన్న విషయాన్ని అధికారికంగా లీక్ చేయకపోయినా, త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అఆ'లో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర చేసిన నటుడేనని మాత్రం ఈ వార్తను లీక్ చేసిన వారు హింట్ ఇచ్చారు. దీంతో 'అఆ' చిత్రంలో పూర్తి స్థాయిలో కనిపించిన కామెడీ ఆర్టిస్టు ప్రవీణ్ మాత్రమే. హీరో నితిన్ ఇంట్లో పనిమనిషిగా చిత్రమంతా కనిపిస్తుంటాడు. పవన్ తిట్టింది ప్రవీణ్ నే అని ఇప్పుడు మరో న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై అటు పవన్ గానీ, ఇటు ప్రవీణ్ గానీ ఇంకా స్పందించలేదు.