: ఆ రోడ్డులో ప్రయాణిస్తే....నట్టడవిలో నాగుపాముపై పాకుతున్నట్టుటుంది!


చుట్టూ దట్టమైన అడవి...పాములా మెలికలు తిరిగే రోడ్డు.. సుమారు 54.4 కిలోమీటర్ల పొడవైన రోడ్డును డ్రోన్ సాయంతో ఒక ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటో 2017 డ్రోన్ ఫోటోగ్రఫీలో ఉత్తమ ద్వితీయ చిత్రం బహుమతిని గెల్చుకుంది. కేవలం డ్రోన్ ల సాయంతో తీసిన ఫొటోలకు మాత్రమే ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కాలిన్ స్టాన్ అనే ఫ్రొటోగ్రాఫర్ డ్రోన్ ఉపయోగించి రొమేనియాలోని ట్రాన్సిల్వేనియా నుంచి రొమేనియా నగరానికి మధ్యనున్న 54.4 కిలోమీటర్ల దట్టమైన అడవిలో సాగే రహదారిని డ్రోన్ తో చిత్రీకరించాడు. ఈ కారడవిలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో కానీ... ఫోటో మాత్రం అద్భుతంగా వచ్చింది. పొడవైన పైన్ చెట్ల మధ్య పెద్ద నాగుపాము మెలికలు తిరిగి ఉన్నట్టు ఉంది. ఈ ఫోటో చూసిన అందర్నీ ఆకట్టుకుంటోంది. 

  • Loading...

More Telugu News