: 24 గంటల్లో ఇంటిని నిర్మించి రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్న బెంగళూరు వ్యాపారి


రికార్డు సమయంలో ఇంటిని నిర్మించేందుకు బెంగళూరు వ్యాపారి ప్రణాళిక సిద్ధం చేశారు. కేవలం 24 గంటల్లోనే ఇంటిని నిర్మించి దాని యజమానికి అందించేందుకు ప్రముఖ వ్యాపారి ప్యాడీ మేనన్‌ సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 15న ఉదయం 6 గంటలకు బెంగళూరులోని ఉత్తర విభాగంలో గల స్టోన్ హిల్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని స్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభిస్తారు. నిర్మాణానికి సిద్ధంగా ఉండే (ప్రీకాస్ట్) అచ్చులను డిజైన్ ప్రకారం ఒక చోట చేర్చి, బిగిస్తారు. దీంతో ఇంటికి ఒక రూపం వస్తుంది. గచ్చులు, వెల్లవేయడం, ఇంటి అలంకరణ, విద్యుత్ దీపాలు అమర్చడంతో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. కేవలం 24 గంటల్లోనే ఈ తతంగం మొత్తం పూర్తి చేసి, 16వ తేదీ ఉదయం 6 గంటలకు గృహ ప్రవేశం చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

  • Loading...

More Telugu News