: హైటెక్ సిటీ దగ్గర రోడ్డు ప్రమాదం... కారు, లారీ దగ్ధం
హైదరాబాదులోని హైటెక్ సిటీ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి వేగంగా వచ్చిన కారు కాంక్రీట్ తయారు చేసే మిక్సర్ లారీని ఢీ కొట్టింది. కారు బలంగా ఢీ కొట్టడంతో వెంటనే మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్లు వేగంగా స్పందించి తమ తమ వాహనాల నుంచి బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లో మంటలు కారు, లారీని చుట్టుముట్టాయి. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో రంగప్రవేశం చేసిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారు, లారీ పూర్తిగా దగ్థమయ్యాయి.